చిరు 153 అప్‌డేట్..!

224
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళీ చిత్రం ‘లూసీఫర్‌’ రీమేక్‌గా చిరు కెరీర్‌లో 153వ సినిమా కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది.

మెగా ప్రాజెక్టు – మెగా సాంగ్‌ రికార్డింగ్ పూర్తయిందని చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు తమన్. అంతేగాదు రేపటి నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు.

టాలీవుడ్‌ అగ్ర హీరోలందరికీ సంగీతం అందించిన తమన్‌ తొలిసారి చిరంజీవి సినిమాకి పనిచేస్తున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’ చిత్రంతో చిరంజీవి ఎంట్రీకి తమన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

- Advertisement -