మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ పై కాస్త సన్సెన్స్ నెలకొంది. ముందుగా ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 4న నిర్వహించాలని అనుకున్నా..కొన్ని కారణాల వల్ల ఆ తేది పోస్ట పోన్ అయినట్టు తెలుస్తోంది. జనవరి 4న కాకుండా 7న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తేదితో పాటు ప్రీ రిలీజ్ వేదికను కూడా మారనుంది. విజయవాడలో చేయాలనుకున్న ఈ కార్యక్రమాన్ని గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో జరపాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ తేదిపై ఖైదీ టీం యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
వాస్తవానికి ఈ ఫంక్షన్ ను ఇటు హైదరాబాద్ లో కాని, అటు విశాఖపట్నంలో కానీ నిర్వహించకుండా… ఏపీ నూతన రాజధాని ప్రాంతమైన విజయవాడ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. కాని, మున్సిపల్ కమిషనర్ అనుమతి ఇవ్వలేదు. స్టేడియంలో ఫంక్షన్ల నిర్వహణకు సంబంధించి కోర్టు షరతులు ఉన్న నేపథ్యంలో, పర్మిషన్ ఇవ్వలేకపోయారు. దీంతో వేదికను హాయ్ ల్యాండ్ కు మార్చారు నిర్వాహకులు. ఆడియో ఫంక్షన్ లేకుండా డైరెక్టర్ గా పాటలను మార్కెట్ లోకి రిలీజ్ చేసి..అభిమానుల కోసం భారీగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరు పాల్గొన్ననున్నట్టు ప్రచారం జరుగుతోంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఖైదీపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈసినిమా జనవరి 11న రిలీజ్ కానుంది.