ఇదేనా.. చిరు కొత్త సినిమా పోస్టర్..?

202
Chiranjeevi's 151st film poster revealed..?
- Advertisement -

దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత రీ ఎంట్రీతో లెట్స్ డూ కుమ్ముడు అంటూ ఖైదీ150 మూవీతో ప్రేక్షకులకు మాంచి ఎనర్జీనిచ్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. చాలా గ్యాప్‌ తర్వాత కత్తి రీమెక్‌ తో ఖైదీగా మారిన చిరూ.. ఇప్పుడు ఫుల్‌ జోషతో  ఉన్నాడు. ఇకనుంచి తన సినిమాలతో  ప్రేక్షకులను ఎంటర్ టైన్‌ చెయ్యడాని  డిసైడైపోయాడు మెగా స్టార్‌ .

ఇదే క్రమంలో ఖైదీ150 తర్వాత వరుస సినిమాతో రెడీగా ఉన్నాడు. అయితే చిరు 151వ సినిమా తొందర్లోనే రాబోతున్నట్లు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. అంతేకాదు..చిరు 151వ సినిమా పోస్టర్‌ కూడా ఇదే..అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించేది ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

 Chiranjeevi's 151st film poster revealed..?

అయితే ఈ చిరు సినిమాని డైరెక్ట్‌ చేయబోయేది బోయపాటి శ్రీను అని ఆ మధ్య అనుకున్నారు. కాని.. ఇప్పుడు ధృవ సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి మెగాస్టార్ 151వ మూవీని డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు. డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి ట్రాక్ రికార్డ్ ఉన్నందున చిరు 151వ  చిత్రాన్ని ఈయనే డైరెక్ట్ చేస్తాడని సమాచారం.

అయితే సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో ఉంటుందని టాక్. ఇక చిరు కూడా ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ చూపడంతో ఏప్రిల్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్ర టైటిల్ తో  చక్కర్లు కొడుతున్న ఆ పోస్టర్  బ్యాక్ గ్రౌండ్ లో చిరు ఫోటోని చూపిస్తూ, కొన్ని పోరాట  సన్నివేశాలు, చెట్టు కొమ్మకి ఉరివేసుకున్న దృశ్యం, పవర్ ఫుల్ గొడ్డలిని పోస్టర్ లో పొందుపరిచారు. ఈ పోస్టర్ ని ఫ్యాన్ మేడ్ పోస్టర్ గా చెబుతున్నారు. ఏదేమైనా ఈ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ ని  ఎంతగానో అట్రాక్ట్‌ చేస్తుంది.

- Advertisement -