- Advertisement -
దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపిన చిరు..గురు తుల్యులు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరా భరణం తర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం అన్నారు.
మీ చిత్రాలు అజరామరం. మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశాడు. చిరు-విశ్వనాథ్ కాంబోలో వచ్చిన శుభలగ్నం, స్వయంకృషి, ఆపద్భాందవుడు ఎవర్‌గ్రీన్ చిత్రాలు. చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ చిత్రాల్లో సినిమాలుగా నిలిచిపోయాయి.
- Advertisement -