చిరంజీవిపై బాలయ్యదే పైచేయి..

307
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ 150వ చిత్రం, బాలయ్య 100వ చిత్రంపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి హీరోలతో పోలిస్తే బాలయ్య 100 సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కే హైప్ ఎక్కువ అంటున్నారు సినీ పండితులు.

గత కొన్నేళ్లలో టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమా, ఇంకో స్టార్ హీరో సినిమాతో తలపడటం అరుదైపోయింది. కానీ ఒకప్పుడు మాత్రం భారీ సినిమాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టేవి. ముఖ్యంగా సంక్రాంతి మరియు దసరా లాంటి పండగలొస్తే క్లాష్ ఆఫ్ టైటాన్స్ ప్రేక్షకులకు మంచి వినోదం పంచేది. చిరు, బాలయ్య మ‌ధ్య గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జ‌రుగుతూనే ఉంది. ఇక రాజ‌కీయంగా కూడా ఇప్పుడు ఒక‌రు ఎంపీగాను, మ‌రొక‌రు ఎమ్మెల్యేగాను ఉన్నారు. ఇక ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు న‌టించిన సినిమాల విష‌యానికి వ‌స్తే సంక్రాంతి ప‌రంగా బాల‌య్య చిరు మీద ఆధిప‌త్యం చాటుతున్నాడు.

Chiru-Balakrishna

గ‌తంలో ఎన్నోసార్లు సంక్రాంతికి పోటీ ప‌డి సంక్రాంతికి బాక్సాఫీస్ వార్‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చిన ఈ ఇద్ద‌రూ హీరోలు దాదాపు 17 సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి సంక్రాంతికి పోటీ ప‌డుతున్నారు. సంక్రాంతి బరిలో చిరంజీవి- బాలకృష్ణ మధ్య తొలిసారి పోటీ 1987లో చోటు చేసుకుంది. ఆ యేడాది చిరంజీవి ‘దొంగమొగుడు’తో బాలకృష్ణ ‘భార్గవరాముడు’ ఢీ కొంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరిది పైచేయిగా సాగింది. అయితే మొత్తం వసూళ్ళ పరంగా దొంగ‌మొగుడిదే కాస్త పైచేయి అయ్యింది. 1988లో చిరంజీవి ‘మంచిదొంగ’తో బాలకృష్ణ ‘ఇన్ స్పెక్టర్ ప్రతాప్’ పోటీ పడింది. ఈ రెండు చిత్రాలు కూడా ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరిది పైచేయిగా సాగాయి.

ఇక 1997లలో బాల‌య్య పెద్ద‌న్న‌య్య‌, చిరు హిట్ల‌ర్ పోటీ ప‌డ్డాయి. రెండూ బాగానే ఆడాయి. ఓవ‌రాల్‌గా మాత్రం వ‌సూళ్ల‌లో పెద‌న్న‌య్య‌దే పై చేయి అయ్యింది. 1999లో చిరు స్నేహంకోసం, బాల‌య్య స‌మ‌ర‌సింహారెడ్డి పోటీ ప‌డ్డాయి. స‌మ‌ర‌సింహారెడ్డి ఇండ‌స్ట్రీ రికార్డుగా నిలిచింది. ఇక 2000 సంక్రాంతి సందడిలో బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’పై చిరంజీవి ‘అన్నయ్య’ పై చేయి సాధించింది.

Chiranjeevi

ఇక 2001లో సంక్రాంతి కానుకగా చిరంజీవి మృగరాజు, బాలకృష్ణ నరసింహనాయుడు జ‌న‌వ‌రి 11న ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. మృగ‌రాజు డిజాస్ట‌ర్‌. న‌ర‌సింహ‌నాయుడు ఇండస్ట్రి హిట్‌. ఆ తరువాత 2004లో బాలకృష్ణ ‘లక్ష్మీనరసింహా’, చిరంజీవి ‘అంజి’ సంక్రాంతికి తలపడ్డాయి. ఆ సారి కూడా బాలకృష్ణదే పైచేయి అయింది. ఆ తరువాత మళ్ళీ పదమూడేళ్ళకు అంటే 2017 సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు ఢీ కొనబోతున్నాయి. దీంతో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారింది. ఈ సారిసంక్రాంతి బరిలో ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

- Advertisement -