మెగాస్టార్‌తో మహానటి!

470
chiru keerthy suresh
- Advertisement -

ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం సైరా. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకురానుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెట్స్‌ పై ఉండగానే మరో సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మిర్చి,జనతా గ్యారేజ్,శ్రీమంతుడు,భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మెగాస్టార్. ‘సైరా’ షూటింగ్ పూర్తికాగానే కొత్త సినిమా మొదలుకానుంది. టైటిల్ ఖరారుచేయని ఈ చిత్రాన్ని త్వరలో లాంఛనంగా ప్రారంభించి.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత నయన తార లేదాఅనుష్క శెట్టి తీసుకుంటారని ప్రచారం జరిగింది. తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహానటి కీర్తి సురేష్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీర్తి సురేష్‌ను సంప్రదించిన కొరటాల శివ కథ వినిపించారని సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌కు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

- Advertisement -