మీ ప్రశంసకు ధన్యవాదాలు: మోడీకి చిరు ట్వీట్

367
chiru modi
- Advertisement -

కరోనా మహమ్మారి పోరులో భాగంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమవంతుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ముందు వరుసలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటుచేసి విరాళాలు సేకరించిన చిరు..ఓ సాంగ్‌ కూడా చేసిన సంగతి తెలిసిందే.

సంగీత దర్శకుడు కోటి అందించి పాటలో చిరంజీవి, నాగార్జున,సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్ నటించగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ పాటను చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ట్విట్టర్ వేదికగా ప్రశంసలు గుప్పించారు.

మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి ధన్యవాదాలు…అందరం మన ఇళ్లలోనే ఉందాం..సామాజిక దూరం పాటిద్దాం..కరోనాపై విజయం సాధిద్దామని ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన చిరు మీప్రశంసకు ధన్యవాదాలు..ఈ మహాకార్యంలో మావంతుగా చిన్న సాయం చేశామని తెలిపారు.

- Advertisement -