న‌న్ను న‌మ్మి ఈ సినిమా చూడండి – మెగాస్టార్ చిరంజీవి

112
- Advertisement -

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయఫేమ్ స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్ల‌లు గా రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థ న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌ లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగా గెస్ట్‌ గా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, కొన్ని ఫంక్ష‌న్ల‌కు ప్రేమ‌తో వ‌స్తాం. అలా నిర్మాత నిరంజ‌న్‌ రెడ్డిపై వున్న సోద‌ర ప్రేమ‌తో వ‌చ్చాను. చాలా త‌క్కువ స‌మ‌యంలో నాకు అత్యంత ఆప్తుడిగా, సోద‌రుడిలా క‌లిసిపోయాడు. ఒక‌వైపు సుప్రీం కోర్డు లాయ‌ర్‌ గా బాధ్య‌త‌లు నిర్వర్తిస్తూ ఎంతో బిజీగా వున్నా మ‌రోవైపు సినిమాలు తీయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగింది. నాతో ఆచార్య చేస్తున్నాడు. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ చేశారు. ఈ సినిమా గురించి నాకు చెబుతూ ద‌ర్శ‌కుడి తీసిన `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా గురించి చెప్పాడు. అప్పుడు నేను చూడ‌లేక‌పోయా. ఇప్పుడు త‌ప్ప‌కుండా చూస్తాను. నేను చేసిన చంట‌బ్బాయ్ స్పూర్తి అని ద‌ర్శ‌కుడు అన్నాడు. మంచి కాంబినేష‌న్ కుదిరింది. నిర్మాత నిరంజన్ వైల్డ్ డాగ్ సినిమా తీసిన‌ప్పుడు న‌న్ను పిల‌వ‌లేదు. నా ఫ్రెండ్ నాగార్జున పిలిచాడు అంటూ స‌ర‌దాగా గుర్తు చేశారు.

ఇక ఈ సినిమా గురించి నిరంజ‌న్ నాకు చెబుతూ, ఈ సినిమాను మీరు చూసి న‌చ్చితేనే ఫంక్ష‌న్‌కు ర‌మ్మ‌న్నారు. సినిమా చూశాను. ఫ్యాబ్యులెస్ సినిమా. తాప్సీ ది చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర వుంటుంది. పింక్‌లో ఎంత అద్భుతంగా న‌టించిందో తెలిసిందే. ఝుమ్మంది నాదం చేసిన‌ప్పుడు వేడుక‌లో చూశాను. అప్పుడు చూసిన అమ్మాయేనా అనిపించింది. వృత్తిప‌రంగా నిబ‌ద్ధ‌త‌తో త‌న‌కంటూ ఓ మార్క్ వేసుకుంది. త‌ను న‌టించిన ఘాజ సినిమా చూశాను. ఇక ముగ్గురు పిల్ల‌లు ఎంట‌ర్‌టైన్ చేశారు. వీరిని చూస్తుంటే, నేను న‌టుడిగా అవ్వాల‌నుకునే బీజం ఏర్ప‌డిన రోజు గుర్తుకు వ‌స్తుంది. చిన్న‌త‌నంలో నేను 8వ త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గా బాల‌రాజు క‌థ‌లో మ‌హాబ‌లిపురం..అని పాట పాడిన పిల్లాడు ప్ర‌భాక‌ర్ ప్ర‌భావం నాపై వుంది. అలా ప‌డిన బీజం న‌న్ను న‌టుడిగా మారేలా చేసింది. ఈ సినిమాలో పిల్ల‌లు బాగా చేశారు. డాన్స్ అద్భుతంగా చేశారు. చాలా అమాయ‌క‌త్వంతో చేసిన న‌ట‌న బాగుంది. వారు క్రైంలో ఇరుక్కోవ‌డం చాలా ఎంట‌ర్‌ టైన్‌మెంట్ ఇస్తుంది.

సెకండాఫ్‌లో ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ అద్భుతంగా మ‌లిచాడు. మేట‌ర్‌, మెటీరియ‌ల్‌, టాలెంట్ వున్న ద‌ర్శ‌కుడు స్వ‌రూప్‌. ఈ సినిమాతో మ‌రింత నిరూపించుకుంటాడు. చిన్న పిల్ల‌ల సినిమా అంటాం. కానీ ఇది పెద్ద‌లు చూడాల్సిన సినిమా. నిర్మాత నిరంజ‌న్ రెడ్డి క‌థ ఎంపిక చేశారంటే ఒక మార్క్ వుంటుంది. నిర్మాత అనేవాడు కేషియ‌ర్ కాదు. క‌థ‌లో, ప్రాసెస్‌లో నిర్మాత ప్ర‌మేయం వుండాలి. అశ్వ‌నీద‌త్‌, అరవింద్‌, కె.ఎస్‌. రామారావు, దేవీప్ర‌సాద్ వంటి నిర్మాత‌లు క‌థ‌లోనూ, సంగీతం, కాస్ట్యూమ్ ఇలా అన్ని రంగాల్లో ఇన్‌వాల్వ్‌మెంట్ అవుతారు. అప్పుడే ఆర్టిస్టుకు భరోసా వుంటుంది. ఈ సినిమా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి నిల‌బెట్టాల‌నే భ‌రోసా క‌లిగిస్తారు. కానీ క్ర‌మేణా నిర్మాత ప‌రిస్థితి కేషియ‌ర్‌ లా మారిపోయింది. మ‌ళ్ళీ ఇన్నాళ్ళ త‌ర్వాత అటువంటి నిర్మాత నిరంజ‌న్ రెడ్డి అని చెప్పుకోవ‌డం గ‌ర్వంగా వుంది. ఆచార్య తీస్తున్న‌ప్పుడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో త‌న అభిప్రాయాన్ని చెప్పే స్థాయి వుంది. ద‌ర్శ‌కుడు, నిర్మాత ఒకేలా ఆలోచించేవిధంగా వుండాలి. ఒక ఈ సినిమాకు కెమెరామెన్‌గా చేసిన దీప‌క్‌, సంగీతం ఇచ్చిన‌ మార్క్‌, క‌ల‌ర్‌ఫొటో హీరో సుహాస్ ను పేరుపేరున ప‌లుక‌రించారు. పాండ‌మిక్ టైంలో క‌ల‌ర్‌ఫొటో సినిమా చూశాను. బాగా న‌టించాడు. అలాగే కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడు మ‌హా, అర్జున్ రెడ్డి వంగా వంటి యంగ్ ద‌ర్శ‌కులు మాకూ అసోసియేష‌న్ ఉంది. మీ సినిమా చూసి ఇన్ స్పైర్ అయ్యామ‌ని చెబుతుంటే ఆనందంగా వుంది. ఇలా మీ అంద‌రినీ క‌ల‌వ‌డం చాలా సంతోషంగా వుంది.

తాప్సీ ఝుమ్మంది నాదం టైంలో చాలా క్యూట్‌గా వుంది. ఆ టైంలో నేను రాజ‌కీయాల్లోకి వెళ్ళిపోయాను. అందుకే ఆమెతో న‌టించ‌లేక‌పోయాను. కానీ ఇప్పుడు నిరంజ‌న్‌రెడ్డి ఆమెతో మెయిన్ కాంబినేష‌న్‌ గా మా ఇద్ద‌రినీ క‌లిపే క‌థ చూడండి అంటూనే. పింక్‌ లా అమితాబ్‌ను డామినేట్ చేస్తే నేను ఒప్పుకోను. అంటూ చ‌మ‌త్క‌రించారు.

అదేవిధంగా మిషన్ ఇంపాజిబుల్ అనేది చిన్న సినిమా కాదు. పెద్ద మ‌న‌సుతో చూడ‌త‌గ్గ సినిమా. ఇందులో చ‌క్క‌టి ఆర్ట్ వుంది. మ‌న‌సును రంజింప‌చేస్తుంద‌ని నేను హామీ ఇస్తున్నా. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు ప‌బ్లిసిటీ అవ‌స‌రంలేదు. ఇలాంటి సినిమాకు కావాలి. ఇక ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ద్వారా తెలుగు ఖ్యాతిని ప్ర‌పంచ దేశాల‌కు తీసుకెళ్ళేలా చేసిన రాజ‌మౌళి, అత‌ని టీమ్‌ కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా. ఇలాంటి చిన్న సినిమాను ఆద‌రిస్తే యంగ్ టాలెంట్ మ‌రింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఏప్రిల్ 1న మీరంతా మాకు ఇచ్చే గిఫ్ట్ మిషన్ ఇంపాజిబుల్ అంటూ చిరు ముగించారు.

- Advertisement -