చిరు, చరణ్‌కు స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ..

211
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య అనే చిత్రంతో నటిస్తున్న విషయం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మే 13న విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగ‌గంగా జ‌రుగుతుంది.గ‌త షెడ్యూల్‌ను మారేడుమిల్లిలో పూర్తి చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఇల్లెందు ఓపెన్ కాస్ట్‌లో షూటింగ్ జ‌రుపుతుంది.

షూటింగ్ నిమిత్తం ఖమ్మంకు వచ్చిన చిరంజీవి, రామ్ చరణ్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ఇంట్లో బస ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వయంగా వారికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు మంత్రి. షూటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నందుకు చిరంజీవికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -