జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనసైనికులు హాజరయ్యారు. ఈ సభను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.
మై డియర్ బ్రదర్ పవన్‌కళ్యాణ్, జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కి మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు! అంటూ చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 14, 2025
Also Read:ప్రజాపాలన కాదు..ప్రజలను వేధించే పాలన: కేటీఆర్