దిల్ రాజు దమ్మున్న నిర్మాత

208
Chiranjeevi praises Dil Raju
- Advertisement -

శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శతమానం భవతి’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వివి వినాయక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దిల్‌రాజుకు దిల్‌ అనే పేరుని ఏ ముహుర్తాన ఆయన పేరు ముందు చేర్చారో కానీ అదే తన ఇంటి పేరు, వంటి పేరు అయిపోయిందన్నారు. దిల్ అనే పేరులో ఉన్నట్టే దిల్‌రాజు దమ్మున్న, ఆరోగ్యకరమైన, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను, అందరూ ఆలోచించే సినిమాలు తీస్తున్నాడని చిరంజీవి ప్రశంసలు గుప్పించాడు. ఒక సినిమాకు దర్శక నిర్మాతలు తల్లిదండ్రులతో సమానం. కానీ ఈరోజుల్లో నిర్మాతలంటే క్యాషియర్‌తో సమానమైపోతున్నాడు. అటువంటి ఈరోజుల్లో కథను నమ్మి, అందుకు తగిన విధంగా ఆర్టిస్టులను, టెక్నిషియన్స్‌ను ఎంపిక చేసుకుని ముందుడి నడిపిస్తున్న దిల్‌రాజు నిర్మాతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడని కొనియాడారు.

 Chiranjeevi praises Dil Raju

అందుకే ఈ తరం హీరోలందరూ దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిని కనపరుస్తుంటారు. దిల్‌రాజు సెంటిమెంట్స్‌ ఉన్న వ్యక్తి. రాజు దిల్‌కు రెండు వైపులా పదునుంది. ఒకవైపు అగ్రెసివ్‌గా ముందుకెళ్ళగలడు. అలాగే మంచి హృదయంతో మంచి సినిమాలు చేస్తున్నాడు. అందుకే తన తొలి సినిమాకు అన్నీ విభాగాల్లో సపోర్ట్‌ చేసిన దిల్‌రాజు తన మూలాలను మరచిపోలేదు.

శతమానం భవతి సినిమా ఓ మంచి వెజిటేరియన్‌ భోజనం చేసినట్టు ఉంది. సాధారణంగా మనం ప్రొఫెషన్‌ దృష్ట్యా మన తల్లిదండ్రులు, ఫ్యామిలీ గురించి పెద్దగా పట్టించుకోం. అటువంటి వారికి ఇదొక హెచ్చరికలాంటి సినిమా అన్నారు.

- Advertisement -