మెగా 151 చిత్రానికి హీరోయిన్ ఫిక్స్‌ .. !

110
Megastar Chiranjeevi 151 Film

చిరంజీవికి ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్ ఇచ్చిన రైట‌ర్స్.. పరుచూరి బ్రదర్స్. అందుకే.. ప్ర‌తీ సినిమాలోనూ వాళ్ల ఇన్‌వాల్వ్‌మెంట్ ఉండేలా చూసుకొంటాడు మెగాస్టార్. తొమ్మిదేళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం. 150 విష‌యంలోనూ ప‌రుచూరి సోద‌రులు కీ రోల్ పోషించారు. అందుకే చిరూ ఇప్పుడు151వ చిత్రాన్ని వీళ్ల చేతుల్లోనే పెట్టాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సిద్ధం చేసిన స్టోరీ లైన్ చిరంజీవికి బాగా నచ్చిందట.

Megastar Chiranjeevi 151 Film

దీంతో దాన్ని డెవ‌లెప్ చేసే బాధ్య‌త‌ని చిరు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌కి అప్ప‌గించాడని సమాచారం. ప్ర‌స్తుతం ప‌రుచూరి సోద‌రులు ఈ స్క్రిప్టుపై వర్క్ మొద‌లెట్టేశారు. వ‌క్కంతం వంశీ లాంటి యంగ్ రైట‌ర్లతో ప‌ని చేసిన సురేంద‌ర్‌రెడ్డి.. ఫస్ట్ టైం ఈ సీనియర్ రైటర్ల పని చేస్తున్నాడు. మార్చిలోగా స్క్రిప్టు పూర్తి చేసి ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నాడట. అన్ని కుదిరితే.. ఈయేడాది చివ‌ర్లో చిరు 151వ చిత్రాన్నీరిలీజ్ చెయ్యాలన్నది చరణ్ ప్లాన్.

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి స్టోరీ 1850 కాలం నాటిది. ఈ క్ర‌మంలో నాటి కాలం లుక్స్లో క‌నిపించ‌డంతో పాటు కాస్త విలేజి టైపు గ్లామర్ ఒలకబోయాలంటే అనుష్కే క‌రెక్ట్ అన్న నిర్ణ‌యానికి చర‌ణ్ వ‌చ్చాడ‌ట‌. అయితే చిరు 150వ సినిమాలోనే అనుష్కను తీసుకోవాల‌నుని భావించినా….ఆమె బాహుబలి 2 షూటింగ్ లో ఉండటంతో.. ఖైదీ నెం 150 మిస్సయ్యింది. మరి ఇప్పుడు అనుష్కకి ఈ ప్రాజెక్టైనా కుదురుతుందో లేదో చూడాలి.