తారకరత్న మృతి..ప్రముఖుల నివాళి

16
- Advertisement -

23 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు నందమూరి తారకరత్న. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తారక్ మృతితో సినీ పరిశ్రమ, టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. ఇక తారక్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

నందమూరి తారకరత్న అకాల మరణం గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఎంతో భవిష్యత్తు ఉన్న, ప్రతిభావంతుడైన, ఎంతో ఆప్యాయత కలిగిన యువకుడు. చాలా త్వరగా వెళ్లిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.

నటుడు నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం అన్నారు పవన్ కళ్యాణ్.

తారకరత్న మృతి వార్త విని షాక్ అయ్యాను. చాలా బాధగా ఉంది. చాలా త్వరగా వెళ్లిపోయావు సోదరా. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని మహేష్ బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

తారకరత్న మృత్యువుతో బలంగా పోరాడి చివరికి కన్నుమూశారన్న విషయం తెలిసి చాలా బాధగా ఉంది. అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండే, దయగల స్వభావం కలిగిన తారకరత్న ఎప్పటికీ గుర్తుండిపోతారు అన్నారు హీరో రవితేజ.

అల్లు అర్జున్ ,యంగ్ హీరో నాగశౌర్య,టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ తదితరులు తారకరత్న మృతికి సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -