ఐ-బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా అన్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా ఏళ్ల నుంచి ఈ పైరసీ అనే మహమ్మారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆందోళన చెందాం… ఎంతో మంది కష్టాన్ని ఒకడు అప్పనంగా దోచుకుంటుంటే బాధ అయ్యేది అన్నారు. హైదరాబాద్ పోలీసులకు ఈ విషయంలో సినీ పరిశ్రమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఐ-బొమ్మ విషయంలో హైదరాబాద్ పోలీసులకు కంగ్రాట్స్ చెప్తున్నా అన్నారు నాగార్జున. మేము ఇక్కడ చేయలేనిది హైదరాబాద్ లో చేశారు అని చెన్నైలో ఓ మిత్రుడు కాల్ చేసి చెప్పాడు…ఐ- బొమ్మ వెనక ఓ పెద్ద ఇంటర్నేషనల్ రాకెటే ఉంది అన్నారు.
6 నెలల క్రితం మా ఇంట్లోనూ ఇలానే డిజిటల్ అరెస్ట్ జరిగింది … వాళ్ల అసలైన మోటివ్ జనాలకు ఫ్రీగా సినిమాలు చూయించడం కాదు …ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లు వాళ్లకు చిల్లరతో సమానం అన్నారు నాగ్.
పైరసీ వల్ల మాకంటే ఎక్కువ అమాయక జనాలే నష్టపోతున్నారు అన్నారు దర్శకుడు రాజమౌళి. మీ పర్సనల్ డేటా అంతా తీసుకుని మీకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు. దీని వెనక వేల కోట్ల రాకెట్ ఉంది. ఏదీ మనకు ఉచితంగా రాదు. ఒకవేళ వస్తుంది అంటే దాని వెనక ఏదో ఒక హిడెన్ స్కాం ఉండే ఉంటుంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి అన్నారు.
Also Read:కొంపల్లి ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఈటల సీరియస్..

