డీప్ ఫేక్‌పై చట్టం తేవాలి:చిరు

7
- Advertisement -

డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి అన్నారు మెగాస్టార్ చిరంజీవి. డీప్ ఫేక్‌పై ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ ప్రయత్నించడం అభినందనీయం అన్నారు. సామాన్యులకు డీప్ ఫేక్ నుండి రక్షణ లభించాలి అన్నారు.

డీప్‌ఫేక్‌ అనేది పెద్ద గొడ్డలి పెట్టులాంటిదని.. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్‌లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని వెల్లడించారు. ఈ కేసును సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని.. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు.

ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన చిరు.. రాష్ట్రీయ ఏక్తాదివస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పందించారు. ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ ఏకతా దినోత్సవం నిర్వహించారు. హైదరాబాద్‌-నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం జరిగింది.

Also Read:సుజీత్‌పై ఇమ్రాన్ ప్రశంసలు

- Advertisement -