మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ పాలిటిక్స్ బాటా పట్టబోతున్నారా ? ఆయనను కాంగ్రెస్ లో తిరిగి యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 లో ఎన్నికల బరిలో దిగిన చిరు.. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతగా మారిపోయారు. 2014 తరువాత ఆయన పూర్తిగా కాంగ్రెస్ కు దూరమవుతూ సినిమాలపై దృష్టి సారిస్తూ వచ్చారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి మాత్రం ఎలాంటి రాజీనామా చేయలేదు. ఈ అంశమే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఏపీలో తిరిగి బలపడేందుకు ఇటీవల షర్మిలకు అధ్యక్ష పదవి కూడా కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పుడు చిరంజీవిని కూడా యాక్టివ్ చేస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందనే ఆలోచనలో హస్తం నేతలు ఉన్నారట. .
తాజాగా చిరంజీవిని ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ నేత చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. చిరంజీవికి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం ఉందని, పోటీ చేసే విషయమై ఆయన నిర్ణయం తీసుకోవాలని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. దీంతో తెరవెనుక చిరంజీవి దిశగా హస్తం నేతలు అడుగులు వేస్తున్నారా ? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అయితే రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని, రాజకీయ రంగంలో రాణించేందుకు తగినవాడను కాదని చిరు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేయలేదనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. దీని బట్టి ఆయన రాజకీయ అరంగేట్రం పునరాగమనం అయ్యే అవకాశం ఉందనేది చాలామంది వ్యక్తం చేస్తున్న మాట. మరి. ఎన్నికల ముందు మెగాస్టార్ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందా ? లేదా అనేది చూడాలి.
Also Read:క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!