ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తమ ప్రతినిధులకు కొత్త గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్‌గా గుర్తింపు కార్డు జారీ చేసింది. 2027వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా పార్టీ అందులో పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న సంగతి తెలిసిందే.
నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు అని చిరంజీవి సోషల్ మీడియాలో మంగళవారం ఓ ఆడియో ఫైల్‌ను పంచుకున్నారు. దానికి ఎలాంటి కామెంట్ రాయకపోవడంతో అందరిలోను సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు చిరంజీవి రాజకీయాల్లో ఉన్నటా లేక తన గాడ్ ఫాదర్ సినిమా కోసం ట్వీట్ చేశారా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? కేవలం తన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ వ్యాఖ్య చేశారా? అని చర్చ సాగుతున్నది. ఇప్పటికే చిరంజీవి జనసేన తరఫున మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్నది.