Chiru:ఈ గౌరవం మీదే

16
- Advertisement -

దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌కు మెగాస్టార్ చిరంజీవిని కేంద్రం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి తన సంతోషాన్ని సందేశం రూపంలో అందరితో షేర్ చేసుకున్నారు.మన దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంతమనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం అండదండలు, నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నా. నాకు దక్కిన ఈ గౌరవం ఇది అన్నారు.

నన్ను ఈ ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. అంటూ సుదీర్థ సందేశాన్ని పంచుకున్నారు. ఇప్పుడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read:విటమిన్-కె లోపిస్తే ప్రమాదమా?

- Advertisement -