- Advertisement -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన చిరు… ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.
ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం అని పిలుపునిచ్చిన చిరు…ఎన్నో త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు పరిశ్రమ అని, దాన్ని కాపాడుకోవడానికి పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఉద్యమించాలన్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరారు.
- Advertisement -