‘మహానటి’ చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ సత్కారం..

235
Chiranjeevi Felicitated Mahanati Team
- Advertisement -

అలనటి అందాల తార సావిత్రి లెజండరీ యాక్టర్‌గా పేరు గాంచింది. తన నటనతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. సినిమా పరిశ్రమపై చెరగని ముద్రవేసి ‘మహానటి’గా ఎదిగింది సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.

Chiranjeevi Felicitated Mahanati Team

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీపై సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. సావిత్రి పాత్రలో కనిపించి మెప్పించింది నటీ కీర్తీ సురేష్.

ఇందులో సమంత మధుర వాణి పాత్రలో నటించగా, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు సీనియర్ నటీనటుల పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమాపై మెగస్టార్ చిరింజీవి ప్రశంసలు కురిపిస్తూ ఈ సినిమా నిర్మాతలైన ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌, దర్శకుడు నాగ్ అశ్విన్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువలు కప్పి సత్కరించారు.

- Advertisement -