గ్యాంగ్‌లీడర్‌ వర్సెస్‌ చిరు ఫ్యాన్స్‌..!

275
nani vs chiru fans
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌-నేచురల్ స్టార్ నాని మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్‌ నడుస్తోంది. నాని ప్రస్తుతం మనం ఫేం విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. నాని బర్త్‌ డే సందర్భంగా సినిమా టైటిల్‌ గ్యాంగ్‌లీడర్‌ అని రివీల్ చేస్తూ టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నాని సినిమా టైటిల్‌పై మండిపడుతున్నారు చిరు ఫ్యాన్స్‌.

బాయ్‌కాట్ నానీస్ గ్యాంగ్‌లీడర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రోలింగ్ మొదలుపెట్టారు. మెగాస్టార్ క్లాసికల్ టైటిల్‌ను నువ్వెలా వాడతావ్ అంటూ నానిపై ఫైర్ అవుతున్నారు.కొంతమంది సినిమా టైటిల్‌ని చేంజ్‌ చేయాలని నానికి వినమ్రంగా సూచిస్తుండగా మరికొంతమందిమాత్రం పరుష పదజాలంతో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది మెగాస్టార్‌ మాత్రమే వాడుకునే టైటిల్ అని ఇంకెవ్వరూ వాడటానికి వీళ్లేదని ఖరాఖండిగా చెబుతున్నారు.

వాస్తవానికి ఈ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా తీస్తే బాగుంటుందని మెగాఫ్యాన్స్ ఆశించారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ, రామ్ చరణ్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే, ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌కు లీడర్‌గా నాని నటిస్తోన్న చిత్రానికి గ్యాంగ్‌లీడర్‌ అంటూ పెట్టడాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో నాని టీం సినిమా టైటిల్‌ని చేంజ్‌ చేస్తారో లేదా అదేటైటిల్‌ని కంటిన్యూచేసి చిరు ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవుతారో అన్నది సస్పెన్స్‌గా మారింది.

- Advertisement -