లక్కీఛాన్స్‌ కొట్టేసే..మహిళా మంత్రులు వీరేనా..!

305
Sabitha Indhra reddy for KCR Cabinet
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తుదిదశ మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీలో మంత్రివర్గ ప్రస్తావన తెచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..ఆన్సర్ ఇచ్చింది సీఎం కేసీఆర్‌. ఇంతవరకు బాగానే ఉన్న ప్రస్తుతం ఆ లక్కీ ఛాన్స్‌ కొట్టేసే ఇద్దరు ఎవరా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇద్దరు మహిళా మంత్రుల్లో ఒకరు సబితమ్మేనన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుండి గెలిచిన సబితా కారెక్కుతారని కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఆమెకు బెర్త్ కన్ఫామ్‌ కావడంతో పాటు బోనస్‌గా ఆమె కుమారుడు కార్తీక్‌ రెడ్డికి చెవేళ్ల ఎంపీ సీటు కూడా ఖాయమైందని టాక్‌. ఈ నేపథ్యంలోనే మంత్రిగా స్ధానం దక్కించుకునేవారిలో ఒకరు సబితేనంటూ పొలిటికల్‌ సర్కిల్‌లో వార్త చక్కర్లుకొడుతోంది. సీఎం కేసీఆర్‌ నుండి సబితకు స్పష్టమైన హామీ లభించినట్లు ఆమె సన్నిహితవర్గాల సమాచారం.

వాస్తవానికి మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటుకల్పిస్తామని చెప్పడంతో మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే రెడ్డిసామాజిక వర్గానికి చెందిన వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కడంఖాయమని గులాబీ పార్టీ నేతలు సైతం చెప్పారు. అయితే ఇప్పుడు ఇదే సామాజికి వర్గానికి చెందిన సబితా ఇంద్రారెడ్డికి కేబినెట్‌ బెర్త్ కన్ఫామ్ అని ప్రచారం జరుగుతుండటం ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఇక మిగిలిన వారిలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఆకుల లలిత,ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రేఖానాయక్‌,సత్యవతి రాథోడ్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి బెర్త్ దక్కడం ఖాయం.అయితే సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో వేచిచూడాలి. మొత్తంగా కేబినేట్ విస్తరణకు సంబంధించి కేసీఆర్ మదిలో ఏముందో తెలియాలంటే లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -