ఓటేసిన సినీ,రాజకీయ ప్రముఖులు

24
- Advertisement -

లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్‌ ఎన్‌. ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు.

కరీంనగర్‌లోని ఓల్డ్ హైస్కూల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌, అలంపూర్‌లో నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌, వనపర్తిలో నిరంజన్‌రెడ్డి, సూర్యాపేటలో జగదీశ్‌ రెడ్డి, మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు క్యూ కట్టారు. జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సీనియర్‌ హీరో శ్రీకాంత్‌, హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, దర్శకుడు తేజ జూబ్లీహిల్స్‌లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలో సతీమణితో కలిసి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఓటువేశారు.

Also Read:ఆర్జే శ్వేత దర్శకత్వంలో అమ్మ

- Advertisement -