నాగ‌బాబు పుట్టినరోజు వేడుకలో చిరు సందడి..

144
chiru
- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అక్టోబ‌ర్ 29,1961న ఆయన జ‌న్మించారు. నేటితో ఆయ‌న 59వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ స‌భ్యులు, అభిమానులు, శ్రేయాభిలాషులు ఆయ‌న‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌,నాగబాబుతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. భావోద్వేగ‌పు శుభాకాంక్ష‌లు తెలిపారు. చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్‌లో నాగబాబు చేత కేక్ క‌ట్ చేయించి త‌మ్ముడి బ‌ర్త్‌డే వేడుక‌ని ఘ‌నంగా జ‌రిపారు మెగాస్టార్. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడితో పాటు ప‌లువురు అభిమానులు పాల్గొన్నారు.

కాగా, నాగబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్లాస్మాదానం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, కరోనా నుంచి కోలుకున్న తాను రెండోసారి ప్లాస్మా దానం చేస్తుండగా అన్నయ్య చిరంజీవి సడెన్ గా వచ్చారని వెల్లడించారు. అయితే, తన అన్నయ్య వస్తున్నట్టు తనతో పాటు ఎవరికీ తెలియదని, తాను వస్తున్నట్టు ముందుగా సమాచారం ఇవ్వకుండానే వచ్చేసి తనను ఎంతో సంతోషానికి గురిచేశాడని వెల్లడించారు. తానెంతో ఇష్టపడే తన సోదరుడు తన జీవితానికి మార్గదర్శిగా ఉండడం ఎంతో హర్షణీయం అని తెలిపారు.

- Advertisement -