చిరంజీవితో సుకుమార్ మల్టీస్టారర్..?

404
Chiranjeevi and Ravi Teja are doing together..?
- Advertisement -

తాజాగా మనముందుకొచ్చి రికార్డులను తిరగరాస్తున్న చిత్రం ‘రంగస్థలం’. వసూళ్ల పరంగా రికార్డులను బ్రేక్ చేస్తూ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాలో రాంచరణ్‏తో కలిసి చేసిన సుకుమార్ ప్రయత్నం ఫలించడంతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్‏లో గుసగుసలు ఊపందుకున్నాయి. అయితే ఈ మల్టీస్టారర్‏లో ఎవరెవరూ నటిస్తున్నారనే కదా మీ ప్రశ్న.

Chiranjeevi and Ravi Teja are doing together..?

గతంలో అన్నయ్య సినిమాలో చిరంజీవితో కలిసి నటించిన రవితేజ ఈ సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి సుకుమార్ ఇప్పటికే మూడు కథలను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఒక కథను చిరంజీవికి కూడా వినిపించాడట సుకుమార్. దీనికి మెగస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మల్జీస్టారర్ కు రవితేజ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. చిరంజీవి ‘సైరా’ మూవీ అయిపోగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్త నిజమా, అబద్దమా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

- Advertisement -