‘భరత్ అనే నేను’..రిలీజ్‌కు ముందే రికార్డు!

261
- Advertisement -

మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పూర్తిస్థాయి రాజకీయ నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నిర్మాతలు ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

అయితే ఈ సనిమా విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా 2000 థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. మహేష్ బాబు సీఎం క్యారెక్టర్ లో నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోగా, అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్యకు మించి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపింది.

Bharat Ane Nenu bags a unique Record

యూఎస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ల అమ్మకం ప్రారంభమైందని యూనిట్ వెల్లడించింది. మొత్తం 1000 సినిమా హాల్స్ లో చిత్రం విడుదలవుతుందని తెలిపింది. అంటే ‘బాహుబలి-2’కు సమానంగా ‘భరత్ అనే నేను’ విడుదల కానుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే, తొలి వీకెండ్ లో 3 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్ రావచ్చని కూడా భావిస్తున్నారు.

- Advertisement -