చిరు లేకుండానే ఆచార్య!

79
acharya

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. చిరు 152వ చిత్రంగా సామాజిక నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ సగం ఇప్పటికే పూర్తికాగా కరోనా కారణంగా బ్రేక్ వచ్చింది. కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడగా తాజాగా కేంద్రం,రాష్ట్రం ఇచ్చిన సడలింపులతో షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఆచార్య షూటింగ్‌ ప్రారంభం కాగా మెగాస్టార్ చిరు షూటింగ్ లో జాయిన్ కావడానికి ఇంకా టైమ్ పడుతుందట. దీంతో చిరు లేని సన్నివేశాలను చిత్రీకరించడానికి కొరటాల ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వచ్చే సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.