- Advertisement -
తన సీటును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాక్కున్నారని చమత్కరించారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవం సందర్భంగా మాట్లాడిన చిరంజీవి…అసెంబ్లీలో కూర్చునే కిషన్‌రెడ్డి.. ఢిల్లీలో నన్ను తప్పించి నా సీటులో కూర్చున్నారు అంటూ అనడంతో సభలోని అందరు నవ్వుకున్నారు.
గతంలో తాను కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు అదే శాఖను కిషన్‌రెడ్డి నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. భారతీయత తత్వం పటిష్టం చేయడానికి ఉత్సవాలు ఎంతో కృషి చేస్తాయన్నారు. ప్రాంతీయ సినిమాల మధ్య తెలుగు సినిమా హద్దులు చేరిపేసిందని తెలిపారు చిరు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ రావు మెగావల్, మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ అర్వింద్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -