కైకాల ఆరోగ్య పరిస్థితిపై చిరు ట్వీట్

89
kaikala
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల ఆరోగ్యానికి సంబంధించి ట్వీట్ చేశారు.

ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహ లోకి వచ్చారని తెలియగానే ఆయనకు వైద్యం చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయన్ని ఫోన్లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారని పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా మళ్ళీ త్వరలో ఇంటికి తిరిగి రావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థమ్స్ అప్ సైగ చేసి చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్ధిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరితోనూ ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చిరు ట్వీట్ చేశారు.

- Advertisement -