బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నామినేషన్ దాఖలుదారుల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. నవంబర్ 6న పోలింగ్ జరగనుండగా 121 స్థానాల కోసం 1,250 మందికి పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు.
అధికార ఎన్డీఏ ప్రచారంలో ముందుండగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్ అంతర్గత విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్ మాట్లాడుతూ, మహాగఠ్బంధన్ తరఫున తేజశ్వీ యాదవ్ సీఎం అభ్యర్థి అవుతారని పేర్కొన్నప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఒకప్పుడు పోటీ చేస్తారని భావించిన విఐపీ (VIP) పార్టీ అధినేత ముకేశ్ సహాని పోటీ నుంచి తప్పుకున్నారు.
బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్… కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో “పూర్తి విజయం సాధించడమే లక్ష్యం” అని అన్నారు. “మా లక్ష్యం 100% స్ట్రైక్ రేట్ సాధించడం,” అని చెప్పారు. తప్పుడు కథనాలను దూరం ఉంచి, అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రమే దృష్టి పెట్టే వ్యూహాలను చర్చించామని పాశ్వాన్ వెల్లడించారు.
ఎన్డీఏ తన ఐదు మిత్రపక్షాలన్నింటినీ గౌరవించింది, చర్చలు పూర్తయ్యాయి. మొత్తం 243 అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. మహాగఠ్బంధన్లా ఎలాంటి గందరగోళం లేదు అని అన్నారు.
Also Read:T20 Worldcup:టోర్నిలో పాల్గొనే జట్లు ఇవే!

