జగ్గారెడ్డివి గాలి మాటలు- మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్

404
Chinta Prabhakar Slams Jagga Reddy
- Advertisement -

ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరును చూసి ప్రజలు విస్తుపోతున్నారు. రాష్ట్రంలో అవగాహన లేని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు. నేడు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ప్రభాకర్‌ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించారు.కరోనా మహమ్మారి విజృంభిస్తే జగ్గారెడ్డి ప్రజల్లో ఉండకపోవడం బాధాకరం. సీఎం కేసీఆర్ కరోనాపై తీసుకుంటున్న చర్యలను దేశం హర్షిస్తోంది. జగ్గారెడ్డి ఒక కేసీఆర్‌ను పొగుడుతారు.. ఒకసారి విమర్శిస్తారు ప్రభాకర్‌ తెలిపారు.

అంతే కాదు సొంత పార్టీ నేతలను కూడా జగ్గారెడ్డి తిడతారు. ఆయనవి గాలి మాటలు, తుపాకీ రామని చేష్టలు.మా మంత్రులు,ఎమ్మెల్యేలను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. కరోనాతో ఆకలితో ఉన్న వారిని ఆదుకుంటున్నది మేము. కాంగ్రెస్‌ నాయకులు గాంధీభవన్‌లో కూర్చుని ప్రగతి భవన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందిని ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతుబంధు వంటి పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి.

మీడియా, సోషల్ మీడియాలో ఉంటూ జగ్గారెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. సంగారెడ్డికి ఎవరొచ్చినా అడ్డుకుంటానంటున్న జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఎప్పుడైనా ఉంటే కదా అడ్డుకునేది. కరోనా వైరస్ సోకుతుందన్న ప్రాణ భయంతో సంగారెడ్డికి జగ్గారెడ్డి రావడం లేదు. హరీష్ రావును విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదు. ఉచిత సలహాలు ఇవ్వడం మాని సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండండి. జగ్గారెడ్డిపై సంగారెడ్డి ప్రజలు తిరుగుబాటు చేసే సమయం త్వరలోనే వస్తుందని మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు.

- Advertisement -