రివ్యూ : చిన్నారి

525
Chinnari Movie Review
- Advertisement -

ప్ర‌ముఖ సౌత్ ఇండియ‌న్ స్టార్ ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం క‌న్న‌డ చిత్రం `మ‌మ్మీ`. తెలుగులో `చిన్నారి` పేరుతో ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్రధాన పాత్రల్లో లోహిత్ ద‌ర్శ‌క‌త్వంలో కెఆర్‌కె ప్రొడక్షన్స్,లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మించింది. కన్నడంలో సంచలన విజయం సాధించిన మమ్మీ….తెలుగులో చిన్నారిగా ప్రేక్షకులను ఆకట్టుకుందా…?లేదా చూద్దాం.

కథ:

గోవాలోని తీర ప్రాంతంలో కొండల మధ్యన ఓ విలాసవంతమైన విల్లా. తన భర్త చివరి కోరిక మేరకు ఓ విల్లాలో ఉండటానికి ప్రియ(ప్రియాంక) తన కూతురు క్రియ(యువీన)తో వస్తుంది. అంతపెద్ద ఇంట్లో చిన్నారి క్రియతో ఆడుకోవటానికి ఎవరు ఉండరు.దీంతో స్టోర్‌ రూమ్‌లోని ఓ బొమ్మతో స్నేహం చేస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎప్పుడైతే స్టోర్ రూమ్‌ నుంచి బొబ్బ బయటకు వచ్చిందో అప్పుడే సమస్యలు మొదలవుతాయి. అసలు క్రియ బయటకు తీసుకొచ్చిన బొమ్మలో ఏముంది..?క్రియ…ప్రియతో దెయ్యాని చూశానని ఎందుకు చెబుతుంది..?అసలు ఆ బొమ్మలో దెయ్యం ఉందా..?చివరకు ఏం జరిగింది అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్…చిన్నారి యువీన నటన, ఫస్టాఫ్ ముందువచ్చే సీన్, నేపథ్య సంగీతం. సినిమా అంతా రెండు మూడు పాత్రల చుట్టూనే సాగుతుంది. ప్రియాంక నటన బాగుంది. తన పాత్రలో ఇమిడిపోయింది. చిన్నారి యువీన నటన అత్యంత సహజంగా అనిపించింది. ఈ సినిమాకి ప్రధాన బలం.. నేపథ్య సంగీతం. చాలాసార్లు ఉలిక్కిపడేలా చేసింది. చిన్న కథని..లో బడ్జెట్‌తో.. సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. చిన్న కథని ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పాలి. కేవలం తలుపు చప్పుళ్లతోనే ఏదో జరుగుతుందన్న భయం కల్పించాడు దర్శకుడు.

Chinnari Movie Review

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథనం, ట్విస్టులు లేకపోవడం. సెకండాఫ్‌ ప్రారంభంలో సన్నివేశాలు తేలిపోయినట్లుగా కనిపిస్తాయి. సెకండాఫ్‌లో బొమ్మలోకి ఆత్మ ఎందుకు వచ్చింది..అనే పాయింట్ మీద కథ సాగుతుంది. అవి సుదీర్ఘంగా సాగి….విసుగు పుట్టిస్తాయి.భయపెట్టే టెక్నిక్‌ కాస్త కొత్తగానే కనిపించిన…. సినిమా అక్కడక్కడ డల్‌ అవుతూ వెళ్తుంది.

సాంకేతిక విభాగం:

ముందుగా చెప్పుకోవాల్సింది నేపథ్య సంగీతం గురించి..ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసింది. దర్శకుడు కథని ప్రారంభించిన విధానం బాగుంది. నేరుగా పాయింట్‌లోకి వెళ్లిపోయి.. ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ మొదలెట్టారు. హారర్‌ని కొంచెం కొంచెం… రుచి చూపిస్తూ వెళ్లారు.హారర్‌ కథలో ఓ భయంకరమైన సన్నివేశం చూపించి.. దాన్ని కలగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు దర్శకులు. అలాంటి టెక్నిక్స్‌ ఈ సినిమాలోనూ వాడారు. సాంకేతికంగా మంచి మార్కులే పడ్డాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

హారర్‌ కథలో ఓ భయంకరమైన సన్నివేశం చూపించి.. దాన్ని కలగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు దర్శకులు. అలాంటి కథనే ఎంచుకుని కన్నడలో మమ్మీగా ఘన విజయం సాధించి నేడు తెలుగులో చిన్నారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేపథ్య సంగీతం, చిన్నారి యువీన నటన, ప్రేక్షకులను భయపెట్టే విధానం సినిమాకు ప్లస్ పాయింట్ కాగా…సెకండాఫ్‌,అక్కడక్కడా డల్‌గా సాగి విసుగుపుట్టించే సన్నివేశాలు సినిమాకు మైనస్ పాయింట్. మొత్తంగా చిన్నారి ప్రేక్షకులను భయపెట్టింది.

విడుదల తేదీ:16/12/2016
రేటింగ్: 2.5 /5
నటీనటులు: ప్రియాంక ఉపేంద్ర, యువీన పార్థవి
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌
నిర్మాత: కె.రవికుమార్‌
దర్శకత్వం: లోహిత్‌

- Advertisement -