కాంగ్రెస్‌కు మరో సెగ..చిన్నారెడ్డి ఫైర్

2
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో బాంబు పేల్చారు మాజీ మంత్రి, సీనియర్ నేత చిన్నారెడ్డి. నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా అంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు…సోనియా గాంధీ నాకు టికెట్ ఇచ్చి, డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పింది కానీ డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డి అతనికే టికెట్ ఇచ్చాడు అని మండిపడ్డారు.

Also Read:నటి అనన్య రాజ్ కన్నుమూత

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులను కలిసి అడిగితే, మీ ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నాడని, కాంట్రాక్టులు తన మనుషులకు రాలేదని, పనులు ఆపుతున్నాడని, కాంట్రాక్టులు రద్దు చేయాలని చెప్పాడని వారు తెలిపారు.

మేఘారెడ్డి నా అనుచరులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి లాగా నేను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుంది కానీ నేను పార్టీ వదిలి వెళ్లను, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుంచి తరిమేస్తాను అని చిన్నారెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -