విష్వక్‌సేన్ హీరోగా వస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ అద్భుతంగా ప్రసంగించారు. ‘ఆస్కార్ వచ్చింది అంటే.. మా బృందం ఎంత కారణమో తెలుగు చలన చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమ కూడా అంతే కారణం. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ కూడా అంతే కారణం అంటూ ఎన్టీఆర్ చెప్పడం ఆకట్టుకుంది. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ బొమ్మను హైలైట్ చేస్తూ ఆస్కార్ నిర్వాహకులు ఎన్టీఆర్ కి ఫుల్ క్రెడిట్ ఇచ్చినా ఎన్టీఆర్ మాత్రం ఆ క్రెడిట్ అందరిది అంటూ చెప్పడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అలాగే, విష్వక్ సేన్ గురించి ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. వేదికపై విశ్వక్ సేన్ మాట్లాడినట్టు నేనెప్పటికీ మాట్లాడలేను. అంత ఉత్సాహం తనలో ఉంటుంది. ఎప్పట్నుంచో నాపైన ఉన్న బాధ్యతతో ఇక్కడికి వచ్చా. నాకు బాగా ఇష్టమైన సినిమాలు తక్కువగా ఉంటాయి. అందులో విష్వక్ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చాలా ముఖ్యమైనది. అందులో విష్వక్, అభినవ్ నటనని చూస్తూ ఉండిపోతుంటా. ముఖ్యంగా విష్వక్‌ని అని ఎన్టీఆర్ చెప్పడం నిజంగా విశేషమే.
ఎన్టీఆర్ లాంటి నటుడు ఒక చిన్న నటుడిని ఇంతగా పొగడటం నిజంగా గొప్పే. విశ్వక్ గురించి ఇంకా మాట్లాడుతూ నటుడిగా తనెంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడో దర్శకుడిగా కూడా అంతే. విష్వక్ ఎప్పుడూ ఏదో ఒకటి నిరూపించుకోవాలనే తపనతో కనిపిస్తుంటాడు. ఈ చిత్రం నిజంగా బ్లాక్‌బస్టర్ కావాలి. ఈ సినిమాతో తను ఘన విజయం సాధించి దర్శకత్వం చేయడం నిలిపేయాలని కోరుకుంటున్నా అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి…