చైనా సింగర్‌ నోట…మన పాట..!

206
Chinese man sings Raj Kapoor's 'Awara Hoon' and steals ...
- Advertisement -

టాలీవుడ్‌ సినిమాల కంటే..బాలీవుడ్‌ సినిమాలు పబ్లిసిటి విషయంలో కాస్త ముందుగానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా ఇతర భాషల్లో కూడా బాలీవుడ్‌ సినిమాలకు మంచి రెస్పాన్స్‌ ఉంటుంది.

అయితే బాలీవుడ్‌ దివంగత నటుడు రాజ్‌ కపూర్‌ నటించిన ‘ఆవారా’ సినిమా గుర్తుందా..? ‘ఆవారా హూ’ అంటూ..ఆ సినిమాలో ఉన్నపాటని పాడాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి డిన్నర్ టేబుల్‌ దగ్గరకూర్చొని పాడుతుండగా, అతని ఫ్రెండ్స్ వీడియో తీశారు. మరికొంతమంది తన ఫ్రెండ్‌ మంచి సింగర్‌ అంటూ.. చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహిస్తున్నారు. కాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. దీన్ని బట్టి చైనాలో బాలీవుడ్ సినిమాలు ఎంతగా ఆదరణపొందుతున్నాయో అర్థంచేసుకోవచ్చు.

ఇక ఇటీవలే హిందీ సినిమాలు ‘దంగల్‌’, ‘భజరంగీ భాయీజాన్‌’ చైనాలో రిలీజై అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్నట్టు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘బాహుబలి’ కూడా త్వరలో చైనా లో రిలీజ్‌కు సిద్దమవుతోంది. మరి అక్కడి ఆడియెన్స్‌ నోట బాహుబలి పాట కూడా రానుందేమో..చూడాలి మరి.

- Advertisement -