టిక్ టాక్‌పై విధించిన తాత్కాలిక నిషేధంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ యాప్ విషయంలో మద్రాస్ హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అలా చేయనిపక్షంలో 54 మిలియన్ల యాక్టివ్ యూజర్లున్న టిక్ టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తామని స్పష్టం చేసింది. టిక్ టాక్ ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే.
అలాగే గూగుల్ ప్లేస్టోర్‌లో టాప్ డౌన్‌లోడ్స్ యాప్‌లో ఇది టాప్‌లో ఉంది. భారత్‌లో దాదాపు 30 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేయడంపై రోజుకు కోట్లలో నష్ట జరుగుతుందని తెలిపింది టిక్ టాక్ మాతృసంస్ధ బైటెడెన్సన్. సుప్రీంకోర్టులో ఈ సంస్థ తరుపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వీ టిక్‌టాక్ నిషేధం కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు.
టిక్ టాక్ నిషేధం వల్ల 250మంది ఉద్యోగుల నష్టం జరుగనుందని తెలిపింది. అలాగే నిషేదం విధించినప్పటి నుంచి రోజుకు రూ. 4.5కోట్ల వరకూ నష్టపోయినట్లు తెలిపారు. ఈ తాత్కాలిక నిషేధం పై ఈనెల 24లోపు సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే నిషేధాన్ని ఎత్తివేస్తామని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.