అల్లు అర్జున్ తో అనసూయ

172
anasuya allu arjun

బుల్లితెరపై యాంకర్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. క్షణం మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన ఐటమ్ సాంగ్ లో నటించిది. రామ్ చరణ్‌ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్ధలం మూవీలో రంగమ్మత్త పాత్రలో నటించి అందరి మనసులు దొచేసుకుంది.

ఇటివలే గ్రాండ్ విక్టరీ సాధించిన ఎఫ్ 2 సినిమాలో నటించింది. ఇక అనసూయ తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ ఈసినిమా స్క్రీప్ట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బిజీగా ఉన్నారు.

ఈమూవీ తర్వాత సుకుమార్ సినిమా ప్రారంభం కానుంది. అయితే సుకుమార్ మూవీలో అనసూయ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. రంగస్ధలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ కు మంచి గుర్తింపు తీసుకువచ్చాడు దర్శకుడు సుకుమార్. ఇలాంటి పాత్రను తనకు ఇచ్చిన దర్శకుడు సుకుమార్ ఇప్పుడు మరో రోల్‌ను అనసూయ కోసం సిద్ధం చేశారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకూ వేచిచూడాల్సిందే.