- Advertisement -
వేద గురువు, ఉపదేశకుడు,శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా హైదరాబాద్ దిల్సుక్నగర్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో పూజలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కట్టెల పందిరిపైకెక్కి ఆలయ శిఖరానికి ఆయన పూజలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పందిరిలో కొంతభాగం కుప్పకూలింది. ఆయనతో పాటు ఉన్న ఇతర పూజారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పూజా సామాగ్రి, పళ్లాలు పైనుంచి పడిపోయాయి. అతికష్టం మీద ఈ ప్రమాదం నుంచి చిన్న జీయర్, ఇతర పూజారులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -