టిబెట్‌ను అస్ధిర పరిచేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని మండి పడింది చైనా. టిబెట్ సమస్యలపై అమెరికా ఉన్నతాధికారిని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
టిబెటన్ సమస్యల కోసం ప్రత్యేక సమన్వయకర్తను అమెరికా నియమించడం చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని చెప్పారు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ . టిబెట్‌ను అస్థిరపరిచే రాజకీయ కుట్ర అని…చైనా దీనిని వ్యతిరేకిస్తున్నదని, ఈ నియామకాన్ని తాము అంగీకరించబోమని లిజియన్ తెలిపారు.
టిబెట్ సమస్యలపై కొత్తగా నియమించిన ప్రత్యేక సమన్వయకర్త రాబర్ట్ డిస్ట్రో పేరును అమెరికా విదేశాంగ మంత్రి మైఖల్ పోంపియో బుధవారం ప్రకటించారు. టెబెట్‌ను అణగదొక్కేందుకు చైనా ప్రయత్నాలు,మానవ హక్కుల ఉల్లంఘనలు, టిబెట్ మత స్వేచ్ఛపై అమెరికా ఆందోళనలు అలాగే ఉన్నాయని తెలిపారు. దీనిపై ఘాటుగా స్పందించిందిచ చైనా.