- Advertisement -
కరోనా కేసుల సంఖ్య మళ్లీ విజంభిస్తుండటంతో మళ్లీ లాక్ డౌన్ బాటపట్టింది చైనా. గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించింది. గత వారం రోజుల వ్యవధిలో ఈ 11 ప్రావిన్స్‌లలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. రాజధాని బీజింగ్‌లో ఇప్పటివరకు 14 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా నిబంధనలను కఠినతరం చేయగా ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తోంది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోని ప్రావిన్స్‌లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గాన్సు, ఇన్నర్ మంగోలియా, నింగ్ క్సియా, గుయిజౌ, బీజింగ్ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నది. దాంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలను అధికారులు మూసివేశారు.
- Advertisement -