చైనాలో మళ్లీ లాక్ డౌన్‌..!

220
china coronavirus
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటగా లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

కరోనా పుట్టిన చైనాలో కొద్దిరోజులుగా పంజా విసరని కరోనా తిరిగి తన ప్రతాపం చూపిస్తోంది.ఈ నేపథ్యంలో ఆ దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నారు.చైనాలోని బీజింగ్,హెబెయ్ ప్రావిన్స్ లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో బీజింగ్ చుట్టుపక్కల 150కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ ను ప్రకటించారు. దీంతో లాక్ డౌన్ ప్రభావం ఐదు లక్షల మంది పై పడనుంది.

లాక్ డౌన్ వేళ నిత్యావసరాల కోసం ఇంటినుండి భయటకు రావడానికి కేవలం ఒక్కరికి మాత్రమే అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఆంక్షల నేపథ్యంలో కేవలం వైద్యం కోసం మాత్రమే ప్రజలను బయటికి వచ్చేందుకు అనుమతిస్తున్నారు.

- Advertisement -