నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానంకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు పుష్టికరమైన ఆహారం తింటూ వయసుకు తగినట్లుగా శరీర దారుఢ్యన్ని ఉండుకునే వారు మన పెద్దలు. ప్రస్తుతం అలా లేదు.. ఏది పడితే అది లేని సమస్యలను కొని తిచ్చుకుంటున్నాము. ముఖ్యంగా వివిద రకాల ఆహార పదార్థాల కారణంగానే ఎనిమిదేళ్ళ వయసులో కూడా పద్దెనిమిదేళ్ళ వారివలె కనిపిస్తున్నారు. అందుకే తినే అహర పదార్థాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలను ఏది పడితే అది తినకుండా చూసుకోవాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. చిన్న వయసులోనే స్తూలకాయం బారిన పడితే ఆ సమస్య వయసు పెరిగే కొద్ది ఎన్నో అనర్తాలకు దారి తీస్తుంది. స్తూలకాయం కారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగడం, బద్దకం, అలసరట, వంటి సమస్యలు చిన్న వయసులోనే దారి చేరుతాయి. ఇవే కాకుండా హార్ట్ ఎటాక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కాబట్టి అధిక బరువుకు దారి తీస్తే అహర పదార్థాలకు దూరంగా ఉంచాలి. నేటి రోజుల్లో పిల్లలు ఎక్కువగా తినే అహర పదార్థాలలో ఐస్ క్రీమ్, పిజ్జా, కుకీస్ వంటివి కచ్చితంగా ఉంటాయి.
Also Read:Harish:గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ఎప్పుడు?
ఇవన్నీ కూడా శరీర బరువును త్వరగా పెంచే అహర పదార్థాలే. ఇందులో అధిక మొత్తంలో కెలోరీలు, ప్రోటీన్లు, ఫ్యాట్ ఉంటుంది కాబట్టి పిల్లలు వేగంగా బరువు పెరుగుతారు. అందువల్ల పిల్లల దృష్టి వీటి వైపు పడకుండా చూసుకోవాలి. వీటితో పాటు డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రై, పొటాటో చిప్స్, డార్క్ చాక్లెట్ వంటి వాటిని కూడా పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కాబట్టి వీటిని కూడా పిల్లలకు దూరంగా ఉంచాయి. వీటి స్థానంలో పిల్లలకు ఫ్రూట్స్ తినడం అలవాటు చేయాలి. అలాగే మార్నింగ్, సాయంత్రం రాగి జావా, వంటి బలమైన పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి అప్పుడే పిల్లలు వయసుకు తగిన బరువుతో దృఢంగా కనిపిస్తారు.