- Advertisement -
కరోనా వైరస్ మహమ్మారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ విజృంభణకు చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అలాంటి పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ డెస్కు ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లు, అనాథ గృహాల్లో ఉంచుతామని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తెలిపింది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ – 1098. ఇతర వివరాల కోసం 040-23733665 నంబర్‌ను ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించొచ్చు.
- Advertisement -