జయరాం హత్యకేసు విచారణకు హాజరైన..

267
shikha-chowdhary
- Advertisement -

ప్రముఖ వ్యాపార వేత్త చిగురపాటి జయరాం హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈకేసును తెలంగాణ పోలీసులకు అప్పగించడంతో పోలీసులు జోరు పెంచారు. ఇప్పటికే నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్ లను అరెస్ట్ చేసిన అధికారులు తాజాగా జయరాం మేనకోడలు శిఖా చౌదరిని విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో ఆమె హైదరాబాద్ లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. జయరామ్ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉందని జయరామ్ భార్య పద్మశ్రీ ఇదివరకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శిఖా చౌదరి, శ్రీకాంత్‌ అనే యువకుడితో సంబంధాలను కొనసాగిస్తోంది.

జయరామ్ హత్య జరిగిన రోజున శిఖా చౌదరి తన స్నేహితుడితో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినట్టు కూడ గతంలో పోలీసుల విచారణలో ఒప్పుకొన్న విషయం తెలిసిందే. అయితే జయరామ్ హత్య కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు పోలీసులు శిఖా చౌదరిని ప్రశ్నించనున్నారు. శిఖా చౌదరి కుటుంబానికి జయరామ్ కుటుంబానికి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా… శిఖా చౌదరిని జయరామ్‌ ఎందుకు తన కంపెనీల్లో డైరెక్టర్‌గా నియమించారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరో వైపు జయరామ్ హత్య విషయం తెలిసిన తర్వాత శిఖా చౌదరి తన ఇంటికి వచ్చిన తర్వాత విలువైన వస్తువులు కన్పించకుండా పోయాయని పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవిషయంపై కూడా పోలీసులు శిఖాచైదరిని ప్రశ్నించనున్నట్లు సమాచారం.

- Advertisement -