శ్రీశైలంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్

6
- Advertisement -

శ్రీశైలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడుతూ,“మా పరివారం అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా?” అని పలకరించారు.

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనం తనకు, తన కుటుంబానికి లభించిన గొప్ప అదృష్టమని తెలిపారు. పరమశివుని మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

శ్రీశైలం దేవస్థానంలో శివశక్తుల దర్శనం తనకు, తన కుటుంబానికి మరపురాని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు. చివరగా “జై భారత్, జై హింద్” అంటూ నినాదం చేశారు.భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందేందుకే తాను శ్రీశైలం వచ్చానని తెలిపారు. ఈరోజు దర్శనం చేసుకుంటానని, రేపు ఉదయం కూడా దర్శనం చేసుకుంటానని ఆయన వెల్లడించారు.

Also Read:MSG:చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్

- Advertisement -