సీన్ రివర్స్‌…నాడు షా..నేడు చిదంబరం

613
chidambaram amith shah
- Advertisement -

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత చిదంబరంను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. అరెస్టుపై హైకోర్టు,సుప్రీం కోర్టులో ఊరట లభించకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు చిదంబరం. దీంతో విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీచేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఉత్కంఠకు తెరదించుతు ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఇంటికి వెళ్లిన చిదంబరంను అధికారులు అరెస్ట్ చేశారు.

సరిగ్గా 2010లో చిదంబరం యూపీఏ సర్కారులో కేంద్ర హోంమంత్రిగా ఉండగా అప్పట్లో అమిత్‌ షా గుజరాత్‌ హోంమంత్రి. ఆయన హయాంలోనే (2005లో) రాష్ట్ర పోలీసులు సోహ్రాబుద్దీన్‌ షేక్‌ అనే నేరస్థుడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో సోహ్రాబుద్దీన్‌ మృతిచెందడం అమిత్‌షా మెడకు చుట్టుకుంది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో అపహరణ, హత్య ఆరోపణల కింద సీబీఐ అధికారులు షాను అరెస్టు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమిత్‌ షా కేంద్ర హోంమంత్రి. ఈ సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

- Advertisement -