అన్నయ్య లేకపోతే చనిపోయేవాడిని:పవన్‌

519
pawan
- Advertisement -

ఇంటర్మీడియట్‌లో ఫెయిలైయినప్పుడు చనిపోవాలనుకున్నానని కానీ అన్నయ్య చిరంజీవి తన దారి వేరే ఉందని చెప్పాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో చిరంజీవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పవన్ భావోద్వేగంతో మాట్లాడారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చేస్తే చిరంజీవే చేయాలి, తీస్తే రామ్‌చరణే తీయాలి అనిపించేలా సైరా తెరకెక్కిందన్నారు. అభిమానుల్లో ఒకడిగా ఇక్కడికి వచ్చాను. జీవితంలో నా స్ఫూర్తి ప్రదాత చిరంజీవి అన్నారు.

సైరాలాంటి గొప్ప సినిమాకి వాయిస్ ఓవర్‌ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అన్నయ్య ఇలాంటి సినిమా చేయాలని కలలు కన్నాను. కానీ ఇలాంటి గొప్ప సినిమా తీసే శక్తి, సమర్థత నాకు లేకపోయాయి. కానీ నా తమ్ముడు లాంటి రామ్‌చరణ్‌ ఈ పని చేశాడు. సురేందర్‌రెడ్డి ఈ సినిమాతో తన కలని సాకారం చేసుకున్నారని చెప్పారు.ఓ అజ్ఞాత వీరుడి కథ ఇది. అలాంటి వ్యక్తి చరిత్రని తెరకెక్కించిన గొప్ప చిత్రంలో నేను నటించకపోయినా గొంతు ఇవ్వగలిగాను అని చెప్పారు.

- Advertisement -