ఛెల్లో షో బాలనటుడు రాహుల్‌ లుకేమియాతో మృతి

97
- Advertisement -

గుజరాతీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. భారత్‌ తరపున ఆస్కార్‌ బరిలోకి దిగుతున్న ఛెల్లోషో బాల నటుల్లో ఒకరైన రాహుల్‌(10) కన్నుముశాడు. గత కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న రాహుల్‌.. అహ్మదాబాద్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్‌ 2న తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాహుల్‌ నటించి ఛెల్లో షో చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. మూవీ రిలీజ్‌కు ముందే రాహుల్‌ మరణించడం సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగింది.

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో భారత్ తరఫున ఛెల్లో షో ఎంపికైంది. భవిన్‌ రాబరి, భవేష్‌ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్‌ రావల్, పరేష్‌ మెహతా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పాన్‌ నలిన్‌ దర్శకత్వం వహించారు.

- Advertisement -