మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు

11
- Advertisement -

ఛత్తీస్‌ఘఢ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు మావోయిస్టు అగ్ర నేత ఆశన్న. ఆశన్న లొంగుబాటుతో మావోయిస్టుల కంచుకోట అబూజ్ మడ్ ఖాళీ అయింది. ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావుతో పాటు 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో 98 మంది పురుషులు, 110 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. పోలీసులకు భారీగా తుపాకులు ఆయుధాలను అప్పగించారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం, హోంమంత్రి సమక్షంలో ఆశన్న లొంగిపోయారు.

సీఎం విష్ణుదేవ్ సమక్షంలో ఆయుధాలు అప్పగించారు మావోయిస్టులు. బీజాపూర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు ఆశన్న.

Also Read:ఉగ్ర‌వాద సానుభూతిప‌రులు..అరెస్ట్

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని మావోయిస్ట్ నెట్‌వర్క్‌పై ఆశన్న లొంగుబాటు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అక్టోబర్ 14న, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మరియు సీనియర్ నాయకుడు మల్లోజుల వెంకటపాలరావు అలియాస్ సోను మహారాష్ట్రలోని గడ్‌చిరోలి ప్రాంతంలో 60 మంది మావోయిస్ట్ దళ సభ్యులతో కలిసి లొంగిపోయారు.

- Advertisement -