చత్తీస్ ఘడ్‌లో ఎదురుకాల్పులు..ఇద్దరు మావోల మృతి

476
maoists
- Advertisement -

చత్తీస్ ఘడ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎస్టీఎఫ్,డీఆర్‌జీ దళాలను లక్ష్యంగా చేసుకుని రెండు ఐఈడీలు మావోయిస్టులు బ్లాస్ట్ చేశారు.

మొర్పల్లి తిమ్మాపురం మధ్య అటవీ ప్రాంతంలో మావోలు జరిపిన ఈ పేలుళ్లలో ఒక జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. అయితే వెంటనే అప్రమత్తమైన జవాన్లు కాల్పులు జరపగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

ఘటన స్థలం నుండి ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోలు మృతిచెందిన ఘటనను ధృవీకరించారు సుక్మా ఎస్పీ శలాబ్ సిన్హా.

Chhattisgarh: 2 Naxals killed in Sukma …Chhattisgarh: 2 Naxals killed in Sukma ….Chhattisgarh: 2 Naxals killed in Sukma

- Advertisement -